హెలెన్ బీభత్సం 49మంది మృతి
కొనసాగుతున్న సహాయక చర్యలు అమెరికా ఐదు రాష్ర్టాల్లో ప్రభావం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో హెలెన్ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఐదు రాష్ర్టాల్లోని 49 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం తుపాను ప్రభావంతో పలు రాష్ర్టాల్లో భీకర వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు బూట్లు, హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. రెస్క్యూ కోసం నాలుగువేల మంది సైనికులు రంగంలోకి దిగారు. 27న హెలెన్ తుపాను ఫ్లోరిడాను తాకింది. తుపాను తీవ్రతతో భారీ ఎత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, ఇళ్ల పైకప్పులు గాలికి లేచి పోయాయి. తుపాను ప్రభావం ఉత్తర, దక్షిణ కరోలినా, జార్జియాలోను హెలెన్ భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి విద్యుత వ్యవస్థ కుప్పకూలడంతో 45 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్లోరిడాలో ఓ ఆసుపత్రిపై ఉన్న 59మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించగలిగాయి.