ముగిసిన ప్రధాని ధ్యానం

Concluded Prime Minister's Meditation

Jun 1, 2024 - 16:20
 0
ముగిసిన ప్రధాని ధ్యానం

కన్యాకుమారి: తమిళనాడు కన్యాకుమారి రాక్​ మెమోరియల్​ లో ప్రధాని మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నంతో పూర్తి అయ్యింది. 45 గంటలపాటు ధ్యానంలో ప్రధాని నిమగ్నమయ్యారు. ధ్యానం సందర్భంగా ప్రధాని మౌన వ్రతాన్ని కూడా పాటించారు. అలాగే ఆహారంలో కేవలం ద్రవ పదార్థాలైన కొబ్బరినీటిని మాత్రమే సేవించారు. ఎన్నికల చివరి విడత ప్రచారం అనంతరం ప్రధాని కన్యాకుమారి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రధాని ధ్యానం సందర్భంగా విపక్ష పార్టీలు నోరు పారేసుకున్నాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కడం గమనార్హం. కాగా విపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలను బీజేపీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 75 రోజుల ఎన్నికల ప్రచారంలో 206 ఎన్నికల ర్యాలీలు, రోడ్​ షోలు, 80 ఇంటర్వ్యూల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు. 

ప్రధాని మోడీ 75 రోజుల ఎన్నికల ప్రచారంలో 206 ఎన్నికల ర్యాలీలు,రోడ్ షోలు, దాదాపుగా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టారు.