స్టార్​ లైనర్ అంతరిక్ష యాత్ర వాయిదా

నాలుగు నిమిషాల ముందు సాంకేతిక సమస్య గుర్తింపు

Jun 2, 2024 - 15:11
 0
స్టార్​ లైనర్ అంతరిక్ష యాత్ర వాయిదా

ఫ్లోరిడా: సునీతా విలియమ్స్​ అంతరిక్ష యాత్ర మరోమారు వాయిదా పడింది. శనివారం అంతరిక్ష యాత్రకు సిద్ధమైన స్టార్​ లైనర్​ వ్యోమనౌకలో నాలుగు నిమిషాల ముందు సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ఈ సమస్యను గుర్తించేందుకు, సరిచేసేందుకు యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యాత్ర తిరిగి ఎప్పుడు చేపట్టనున్నామనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. గత నెల 7నే జరగాల్సిన యాత్ర కాస్త ఒకసారి సాంకేతిక సమస్య వల్ల వాయిదా పడింది. మళ్లీ శనివారం కూడా వాయిదా పడడంతో ఈ యాత్రపై పలు అనుమానాల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాగా డేటాను విశ్లేషించిన తరువాత సమస్య మూలాలను కనుగొంటామని వాటిని సరిచేశాకే యాత్ర చేపడతామని శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు. మరోవైపు నాలుగు  నిమిషాల ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం కూడా దప్పిందనే వాదనలు వినబడుతున్నాయి.