ముంబాయిలో బోటు మునక.. 13 మంది మృతి

101 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

Dec 18, 2024 - 22:00
 0
ముంబాయిలో బోటు మునక.. 13 మంది మృతి

మృతులకు రూ. 5 లక్షల పరిహారం

ముంబాయి: ముంబాయి గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటాకు వెళుతున్న నీల్​ కమల్​ బోటు మునిగిపోయింది. ముగ్గురు నౌకాదళ సిబ్బందితో సహా 13 మంది మృతి చెందారు.  బోటులో ప్రయాణిస్తున్న మరో 101 మందిని రెస్క్యూ బృందలు సురక్షితంగా రక్షించారు. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 80 మంది ప్రయాణించే బోటులో పరిమితికి ప్రయాణించడం వల్లే మునిగిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఉరాన్​ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నీల్​ కమల్​ బోటును ఎలిఫెంటా గుహలకు వెళుతుండగా నావికాదళ పెట్రోలిగ్​ స్పీడ్​ బోట ఢీకొట్టింది. దీంతో బోటు మునిగిపోయింది. మృతిచెందిన 13 మందిలో పది మంది పౌరులు, ముగ్గురు నేవీ ఉద్యోగులని మాహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. రక్షించిన వారిని ముంబాయిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంప నేవీ, పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.