పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

I want to participate in party building

Aug 4, 2024 - 21:08
 0
పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రామకృష్ణాపూర్ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఐ  పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరంలోకి అడుగులు వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే స్దానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పార్టీ పట్టణ కార్యదర్శి మిట్ట పెల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, మేరుగు రాజేషం, సురమల్ల వినయ్, గాండ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.