గణనాథుడికి ఘనంగా పూజలు

Great worship to Lord Ganath

Sep 11, 2024 - 17:59
 0
గణనాథుడికి ఘనంగా పూజలు
నా తెలంగాణ, మంచిర్యాల: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల చున్నం బట్టి వాడలోని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుర చైర్మన్ ఉప్పాలయ్య,
అంజనీపుత్ర సంస్థ  చైర్మన్ గుర్రాల శ్రీధర్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా పుర చైర్మన్ ఉప్పాలయ్య మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహా దానమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందని, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సంస్థ  ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు కిషన్, సదానందం తదితరులు పాల్గొన్నారు.