దొంగతనం కేసులో ఒకరికి జైలు శిక్ష
One jailed in theft case
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దొంగతనం కేసులో మంచిర్యాలకు చెందిన నదీమ్ అన్సారీ అనే వ్యక్తికి జిల్లా కోర్టు తొమ్మిది నెలలపాటు సాధారణ జైలు శిక్ష విధించినటు పట్టణ ఎస్సై రాజశేఖర్ గురువారం తెలిపారు. క్యాతన్ పల్లి ఎక్స్ రోడ్డు వద్ద సుర రాయలింగు అనే వ్యక్తి ఇంట్లోఈ యేడాది మే నేలలో జరిగిన దొంగతనం కేసు నదీమ్ అన్సారీపై పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. ఈ మేరకు సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా కోర్టు నేరం ఋజువు కావడంతో నదీమ్ కు 9 నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.