డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Laying of drainage works

Aug 4, 2024 - 21:10
 0
డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని రెండోవ వార్డు జ్యోతి నగర్‌లో డ్రైనేజీ నిర్మాణం పనులకు ఆదివారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనితో పాటు త్వరలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ చైర్మన్ కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.