మతమార్పిళ్లపై వాల్మీకి సంఘం ఆందోళన

సస్పెండ్​ చేసి, అరెస్ట్​ చేయాలని డిమాండ్​

Aug 4, 2024 - 20:44
 0
మతమార్పిళ్లపై వాల్మీకి సంఘం ఆందోళన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ నజీమ్ హుస్సేన్, సబ్ రిజిస్ట్రార్ నసీమ్ హైదర్, మరో ప్రొఫెసర్​ షాహిద్ తస్లీమ్ లను వెంటనే సస్పెండ్​ చేసి, అరెస్టు చేయాలని ఆదివారం ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద వాల్మీకి మహాపంచాయత్​ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. వీరు ముగ్గురు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని మాతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వారి మాట వినకుంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నారని ఆరోపించారు. 

ఈ యూనివర్సిటీలో ఏళ్ల తరబడి దళితులు, వాల్మీకి వర్గాలపై అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వాల్మీకసంఘం మహాపంచాయత్​ హెచ్చరించింది. కాగా వీరు ముగ్గురిపై జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.