ఆన్ లైన్ మోడ్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు
ఆర్టీఐ 16వ వార్షిక సదస్సులో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 80 శాతం మేర 2018 నాటికే ఆన్ లైన్ మెడ్ లోకి మార్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై మంగళవారం న్యూ ఢిల్లీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 16వ వార్షిక సదస్సులో మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని ప్రసంగించారు. మోదీ పాలనలో పాదర్శకత, పౌర కేంద్రీకరణను పెంపొందించామన్నారు. ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించామన్నారు. పౌరులకు హ్యూమన్ రైట్స్ హక్కులపై అవగాహన కల్పించేందుకు సమాచార కమిషన్లు అనేక వర్క్ షాప్ లను నిర్వహించాయన్నారు. అధికారుల సహకారంతో పారదర్శకత, గోప్యత వంటివి పాటిస్తూనే సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం కృషి చేసిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.