విషవాయువుల మిల్లు మాకొద్దు
మూకుమ్మడిగా కదిలిన మరిపెడ గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు
నా తెలంగాణ, డోర్నకల్: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గత కొంతకాలంగా విషవాయువులు వెదజల్లుతున్న విద్యా హెర్బ్స్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని మరిపెడ గ్రామస్థులు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని డా. బీమ్ రావు అంబేడ్కర్ విగ్రహం వద్ద సమావేశమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామికి విద్యా హెర్బ్స్ కారణంగా గ్రామంలో జరుగుతున్నఅనర్థాలను, ఆరోగ్య దుస్థితిని వివరించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. కారం మిల్లు వ్యర్థాలతో గ్రామంలోని నల్ల చెరువు కలుషితమై చేపల ఉత్పత్తి పూర్తిగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు కలుషితమై మూగ జీవాలు నీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సమీపంలోని పంట పొలాలు, మామిడి తోటల్లో ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో
గంట్ల గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ అజీజ్, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, వేర్మరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కుడితి నరసింహారెడ్డి, పర్వతం చంద్రశేఖర్, ఉడుగుల రాజు, వంగవీటి భరత్, ఉప్పల సతీష్ గంధం భద్రయ్య, బాషిపంగు శివ, వెన్నె భరత్, బాలనాగు శివ శంకర్, అజయ్ చారి, బాల కృష్ణ చారి, సాదిక్, గంధం వీరన్న తదితరులు పాల్గొన్నారు.