ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం
ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం.. కాంస్యంతో మెరిసిన మనుభాకర్ 10మీటర్ల ఏయిర్ పిస్టల్ లో 12యేళ్ల తరువాత తొలి పతకం.. ప్రధాని మోదీ అభినందనలు
పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన ఈ పోటీలో భారత్ కు చెందిన క్రీడాకారిణి మనుభాకర్ 221.7 పాయింట్లు సాధించి పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2024 ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకాన్ని సాధించినట్లయ్యింది.
కొరియాకు చెందిన ఓయ్ యే జెన్ 243.2 పాయింట్లతో స్వర్ణం సాధించగా, మరో క్రీడాకారిణి కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతనాన్ని దక్కించుకుంది.
12 యేళ్ల తరువాత భారత్ కు షూటింగ్ లో పతకం వచ్చింది. 2012లో షూటింగ్ విభాగంలో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం, 2008లో అభినవ్ బింద్రా స్వర్ణం, 2004లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రజత పతకాలు సాధించారు.
ప్రధాని మోదీ అభినందనలు..
గ్రేట్ మను భాకర్, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు అభినందనలు అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కడం ఈ విజయం మరింత ప్రత్యేకమన్నారు. ఇది అపురూపమైన విజయం అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.