విమాన ప్రమాదంలో మలావి రాష్ట్రపతి దుర్మరణం
Malawi Vice President dies in plane crash
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మలావి ఉప రాష్ట్రపతి సౌలోస్ క్లాస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో 9 మంది కూడా మృతిచెందినట్లు ఆ దేశ రాష్ర్టపతి కార్యాలయం అధికారికంగా తెలిపింది. మంగళవారం ఉదయం డిఫెన్స్ విమానంలో ఉప రాష్ట్రపతి చిలిమా 9మంది అధికారులు, భద్రతా సిబ్బంది తో రాజధాని లిలాంగ్వే నుంచి చక్వేరా బహామాస్ కు వెళుతుండగా విమానం అదృశ్యమైనట్లు గుర్తించారు. రాడార్ తో కూడా సంబంధాలు తెగిపోవడంతో వెంటనే ప్రత్యేక విమానాలతో గాలింపు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ లో విమానం ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న ఉప రాష్ట్రపతి తో సహా 9మంది మృతి చెందారు. మలావి ఆఫ్రికా ఖండంలోని దేశం.