జమ్మూకశ్మీర్​ లో బీజేపీ విజయం తథ్యం

పీవోకేని రాష్ర్టంలో కలుపుతాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​

Sep 26, 2024 - 18:58
 0
జమ్మూకశ్మీర్​ లో బీజేపీ విజయం తథ్యం
శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, పీవోకేని రాష్ర్టంలో కలుపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. జమ్మూకశ్మీర్​ లోని రామ్​ గడ్​ లో గురువారం నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్​, ఎన్సీలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ప్రత్యేక జెండాపై ఎన్సీ చెప్పిన దానికి మద్ధతిస్తారా? అని రాహుల్​ గాంధీని సూటిగా ప్రశ్నించారు. పాక్​ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే దిక్కూ దివానం లేదన్నారు. ఆ దేశంలో తిండిగింజలకు కూడా కొరత ఉందని ఇక్కడి ప్రజలు తెలుసుకోవాలన్నారు. పీవోకే ప్రజలు స్వచ్ఛందంగా భారత్​ లో కలవాలని కోరుకుంటున్నారని అన్నారు. పాక్​ మానవత్వానికి శత్రువుగా పరిణమిస్తోందని ఇది ప్రపంచ మానవాళికి ప్రమాదకరమన్నారు. 
 
370, 35ఏలను తిరిగి తీసుకురావాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వీటితో జాగ్రత్తగా ఉండాలన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రధాని మోదీ ప్రభుత్వానికే మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి యువతను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రవాదం, రాళ్లదాడులు, వేర్పాటువాదం అనే దుశ్చర్యలకు పాల్పడేందుకు ఈ పార్టీలు తెరతీశాయని గుర్తించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ లు దేశాభివృద్ధి, యువత బంగారు భవిష్యత్​ కు బాటలు వేస్తున్నాయని తెలుసుకోవాలని యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు.