పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య
Home guard committed suicide by drinking insecticide
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో హోంగార్డుగా పనిచేస్తున్న నూర్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని జైత్రం తండాకు చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లిలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి 108 లో తరలించగా పరీక్షించిన డాక్టర్లు.. నూర్ సింగ్ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వెల్లడించారు.