బడి ఈడు పిల్లలు బడిలోనే బడిబాటలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Collector Ashish Sangwan in Badibata in school children

Jun 6, 2024 - 16:52
 0
బడి ఈడు పిల్లలు బడిలోనే బడిబాటలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

నా తెలంగాణా, నిర్మల్: బడి ఈడు పిల్లలు, డ్రాప్అవుట్లు ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. జయ శంకర్ బడి బాట రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభం అయింది. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ లో ఈ కార్యక్రమాన్ని ఆయన డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ జూన్ 19 దాకా కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యేలా చూడాలన్నారు. మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశంలో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే నమోదు చేయాలని కలెక్టర్​ సాంగ్వాన్​ సూచించారు. బడి ఈడు, బడి బయట పిల్లలను, బాల కార్మికులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు. విద్యార్థులతో కలిసి, బడిబాట ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గజానన్ రావు, డిపీఆర్ఓ విష్ణువర్ధన్, ఈఈ అశోక్ కుమార్, డిఈ తుకారాం, ఏఈ షరీక్ అలీ ఖాన్, మండల విద్యాధికారి కస్తూరి శంకర్​ తదితరులు పాల్గొన్నారు.