నా తెలంగాణ, ఆదిలాబాద్: ధరణి సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో నూతన రెవెన్యూ చట్టం-2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చర్చా వేదిక కొనసాగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నూతన చట్టంపై ఉద్యోగులు, రైతు సంఘాలు హాజరై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ముసాయిదా చట్టం అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలిపారు.
ప్రజలకు, రైతులకు మేలు చేసేలా చట్టం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టంలోని సెక్షన్ లను తెలిపారు. అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పలు సెక్షన్ లను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామస్థాయి రికార్డులను డిజిటలైట్ చేయాలన్నారు. గ్రామస్థాయి భూముల వివరాలను సవివరంగా నమోదు చేయాలన్నారు. రెవెన్యూ చట్టాలను గ్రామస్థాయిలోనూ పునరుద్ధరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆదిలాబాద్, ఖానాపూర్ ఆర్డీవోలు వినోద్ కుమార్, జీవాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ రాం రెడ్డి, వివిధ రైతు సంఘాల నాయకులు, తహసీల్దార్ రిటైర్డ్ తహసీల్దార్లు, మీ సేవా, ధరణీ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.