నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మహారాష్ర్ట, ఐదు రాష్ర్టాల్లోని ఉప ఎన్నికలలో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. శనివారం జరుగుతున్న ఎన్నికల లెక్కింపులో మహారాష్ర్టలో మహాయుతి కూటమి 226 సీట్ల ఆధీక్యంలో కొనసాగుతుంది. అదే సమయంలో గోవా, గుజరాత్, చత్తీస్ గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్, యూపీ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటుతుంది. మహారాష్ర్టతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలు, సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇళ్ల వద్ద బీజేపీ నేతల సంబురాలు నిర్వహిస్తున్నారు. మోదీ నేతృత్వంలో మరోసారి మహారాష్ర్టలో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుంది.
ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని అందిస్తారని తాను ఊహించలేదని ఏదీ ఏకమైనప్పటికీ అఖండ భారత్ వైపే ప్రజలు మొగ్గు చూపారన్నది స్పష్టమవుతుందని సాయంత్రం సంబురాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పిలుపునిచ్చారు.