31 ప్రిడేటర్​ డ్రోన్​ల ఒప్పందం పూర్తి

రూ. 32 వేల కోట్ల విలువ భారత రక్షణ, తీర రక్షణ మరింత పటిష్ఠం హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్​

Oct 15, 2024 - 14:47
 0
31 ప్రిడేటర్​ డ్రోన్​ల ఒప్పందం పూర్తి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–అమెరికాల మధ్య 31 ప్రిడేటర్​ డ్రోన్​ ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు మంగళవారం భారత నౌకాదళ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం విలువ రూ. 32వేల కోట్లన్నారు. దీంతో భారత సరిహద్దు, తీర రక్షణ భద్రతలు మరింత పటిష్టం అవుతాయన్నారు. దీంతో హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్​ పెట్టొచ్చు. ఒప్పందానికి రక్షణ శాఖ కేబినెట్​ కూడా గత వారం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ఉన్నతాధికారులు, సైనికాధికారుల సమక్షంలో ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.

ఈ ఒప్పందంపై యూఎస్​ ప్రతినిధి మాథ్యూ మిల్లర్​ మాట్లాడుతూ.. భారత్​–అమెరికా మధ్య సాంకేతిక, సైనిక, ఆయుధ సహకారాన్ని గణనీయంగా పెంపొందించనున్నామన్నారు. ఇందులో భాగంగానే ఒప్పందం కుదిరిందన్నారు. ఎంక్యూ–9బి రకం డ్రోన్లను అందజేస్తామన్నారు. తొలివిడతలో 15 డ్రోన్​ లు ఆ తరువాత దశల వారీగా మరిన్ని డ్రోన్​ లను అందజేస్తామన్నారు. డ్రోన్లలో వైమానిక దళం, ఆర్మీకి 8 చొప్పున భారత రక్షణ శాఖ అందజేయనుంది.