జిలేబీ తయారీలో బీజేపీ!

BJP in preparation of Jelebi!

Nov 23, 2024 - 09:43
 0
జిలేబీ తయారీలో బీజేపీ!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ ముందంజలో కొనసాగుతుండగా, మరోవైపు బీజేపీ పార్టీ కార్యాలయంలో జిలేబీ తయారీ జోరందుకుంది. శనివారం ఉదయం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతుండడం బీజేపీ సొంతంగానే వందకుపైగా స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుండడం, మరోవైపు మహాయుతి కూటమి పార్టీలు కూడా భారీ సీట్లతో ముందంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి డబుల్​ సెంచరీ దిశగా ముందంజలో కొనసాగుతుండడంతో దేశవ్యాప్త బీజేపీ నాయకుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. గెలుపు దిశగా కమలం హవా కొనసాగుతుండడంతో ముంబాయిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పెద్ద యెత్తున జిలేబీ తయారీ మొదలైంది. 


ఆర్థిక రాజధానిని కైవసం చేసుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం ఏం కాదు. ఇక్కడ మోదీ నేతృత్వంలో బటేంగే తో కటేంగే (విడిపోతే నరికివేయబడతాం) అన్న నినాదం ప్రజల మనస్సులోకి వెళ్లింది. ఇదే సమయంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధిపై మోదీ ప్రచారం ఫలించిందనే చెప్పాలి.