ప్రజా విశ్వాసం దక్కించుకున్న బీజేపీ
మోదీ నేతృత్వంలో మరింత ముందుకు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య
లక్నో: ప్రజల విశ్వాసం బీజేపీ ఉందనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారంలో కార్యకర్తలు ముందువరుసలో ఉండి శ్రమించారన్నారు. మోదీ, యోగి నేతృత్వంలో ముస్లిం ప్రాంతాలలో కూడా బీజేపీ గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు కూడా శాంతి, సుస్థిరత, అభివృద్ధిలకు ప్రాధాన్యం ఇచ్చి బీజేపీకి ఓట్లు వేశారన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ను ప్రజలంతా నమ్మారని అన్నారు. ముఖ్యంగా యూపీ నుంచి రౌడీ రాజకీయాలను తరిమికొట్టగలిగామన్నారు. అందరి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనడంలో బీజేపీ సఫలకృతం అయ్యిందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.