ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య.. నిందితుడి ఆత్మహత్య

Murder of five members of the same family.. Accused commits suicide

May 18, 2024 - 19:30
 0
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య.. నిందితుడి ఆత్మహత్య

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ సారన్​ గఢ్​ లో ఓ యువకుడు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి తాను ఉరివేసుకుని చనిపోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. కుటుంబంలోని ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తిని ఇంటిపక్కనే ఉన్న పప్పు టేలర్​ కు వివాదాలున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుత్తి, గొడ్డలితో ఐదుగురిని హత్య చేసిన అతడు అనంతరం ఉరివేసుకుని చనిపోయినట్లు వివరించారు.

హత్యల విషయం తెలుసుకున్న సారన్​ గఢ్​ జిల్లా ఎస్పీ పుష్కర్​ శర్మ అదనపు బలగాలను రప్పించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో 144 సెక్షన్​ విధించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పుష్కర్​ శర్మ పేర్కొన్నారు.