తెలుగు రాష్ట్రాలకు అండ
Help for the Telugu states
ప్రధాని మోదీకి ధన్యవాదాలు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండి సహాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురు ముఖ్యమంత్రులతో వర్షాలు, వరద పరిస్థితులపై చర్చించి నిర్ణయం తీసుకోవడం ముదావహం అన్నారు. సహాయం కోసం ఎన్డీఆర్ ఎఫ్, హెలికాప్టర్లను అందించి తెలంగాణ, ఏపీకి రూ. 3,300 కోట్లను కేటాయించడం పట్ల మోదీ దార్శనికతకు అద్దం పడుతుందని కొలన్ శంకర్ రెడ్డి తెలిపారు.