మెడికో హత్య తల్లిదండ్రులకు డబ్బులివ్వజూస్తారా?

తెల్లకాగితంపై సంతకాలెందుకు మమత ప్రభుత్వానికి బీజేపీ సంబిత్​ పాత్ర ప్రశ్నలు

Sep 6, 2024 - 19:49
 0
మెడికో హత్య తల్లిదండ్రులకు డబ్బులివ్వజూస్తారా?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్జీకర్​ మెడికో అత్యాచారం, హత్యపై రాష్​ర్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ సంబిత్​ పాత్ర మండిపడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వజూపడం కేసును తప్పుదారిపట్టించేందుకు ప్రయత్నం జరిగిందని తెలిసిపోతుందన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా తల్లిదండ్రులను ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. తెల్లారాక గానీ మృతివార్తను తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం వెనుక కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెల్లకాగితంపై తల్లిదండ్రుల సంతకాలు ఎందుకు అవసరం పడ్డాయని టీఎంసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆరోపణలన్నింటిపై సమగ్ర విచారణతో నిజనిజాలు వెలుగులోకొస్తాయని తెలిపారు. మమత ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అనేకమైన హేయమైన దాడులను బీజేపీ ఎప్పటికప్పుడూ ఎండగడుతున్నా ఇండి కూటమి నాయకులకు మాత్రం మమత పాలన చక్కెరతో సమానమని సంబిత్​ పాత్ర విమర్శించారు.