సెపా రెండో వార్షికోత్సవంలో కౌన్సిల్ డైరెక్టర్ అహ్మద్ అల్జీబీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ – దుబాయ్ అద్భుతమైన వాణిజ్య ప్రగతి సాధించాయని సెపా (సీఈపీఏ–సెంటర్ ఫర్ యూరోపిన్ పాలసీ అనాలసిస్) కౌన్సిల్ డైరెక్టర్ అహ్మద్ అల్జీబీ తెలిపారు. శుక్రవారం భారత్ – యూఏఈ మధ్య రెండు సంవత్సరాల ప్రగతి వార్షికోత్సవాన్ని దుబాయ్ లో ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ డైరెక్టర్ అహ్మద్ అల్జీబీ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్ 6న దుబాయ్ లో జరిగిన ఒప్పందాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడుల్లో ప్రగతి అద్భుతమైన పురోగతి ఉందని ప్రశంసించారు.
ఇరుదేశాల మధ్య సెపా ద్వారా ఆర్థిక సహకారం మూలస్తంభంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం వంద కంటే ఎక్కువ సబ్ సెక్టార్ లలో మంచి ఫలితాలు సాధించామని వివరించారు. దీంతో భారత్ – దుబాయ్ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయిందన్నారు.
రెండేళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 15 శాతం పెరిగిందన్నారు. యూఏఈ ఎగుమతులు 7 శాతం పెరగగా, భారతీయ ఎగుమతులు 27 శాతానికి పెరిగాయని అహ్మద్ అల్జీబీ తెలిపారు. సెపా ద్వారా జరిగిన ఒప్పందాలు వాణిజ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని, ఆర్థిక వ్యవస్థల పరిపూర్ణతకు లబ్ధి చేకూరుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.