ఉపాధ్యాయుల కృషి వల్లే యువత ఉన్నతస్థానానికి

Due to the efforts of the teachers, the youth can reach the top

Sep 5, 2024 - 11:54
 0
ఉపాధ్యాయుల కృషి వల్లే యువత ఉన్నతస్థానానికి

డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణన్​ కు నివాళులు
దేశ ప్రజలు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యువతను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణన్​ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..

దేశ భవిష్యత్తును నిర్మించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయ జయంతి సందర్భంగా డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణన్​ కు నివాళులర్పించారు. ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.