ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య భారత్ దిశగా మోదీ అడుగులు 

Health is greatness Modi's steps towards a healthy India

Jun 21, 2024 - 14:08
 0
ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య భారత్ దిశగా మోదీ అడుగులు 

నా తెలంగాణ, హైదరాబాద్​: యోగాతో ఆరోగ్యం మన సొంతమని, ధ్యానం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసాన్ని సొంతం చేసుకోగలమని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్​ చార్జీ అందెల శ్రీరాములు యాదవ్​ అన్నారు. బండగ్​ పేట్​ కార్పొరేషన్​ అల్మాస్​ గూడలో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యోగా డే వేడుకల్లో అందెల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యోగా గురువు శ్రీనివాస వాజ్​ పాయ్​ విచ్చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో యోగాసనాలు వేయించారు. యోగా అభ్యసనతో భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని శ్రీనివాస్​ పేర్కొన్నారు. యోగా ద్వారానే ఆరోగ్య భారత్​ నిర్మాణం సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిడి శూర కర్ణ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, రామిడి వీర కర్ణ రెడ్డి, జోరాల ప్రభాకర్, జి. శశివర్ధన్ రెడ్డి, భాస్కర్, లక్ష్మీనారాయణ, సంపత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జంగా చారి, లక్ష్మీ నరసింహారెడ్డి, శ్రీధర్ నాయక్, సైదులు, పరిసర కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.