ఐపీసీ చట్టాలను అమలు చేయొద్దు

ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

Jun 21, 2024 - 14:19
 0
ఐపీసీ చట్టాలను అమలు చేయొద్దు

కోల్ కతా: మూడు చట్టాలను అమలు చేయవద్దని పశ్చిమ బెంగాల్​ సీఎం మమతాబెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. ఈ చట్టాలపై సమీక్ష, చర్చ అవసరమని తెలిపారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–2023 చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మమత మోదీకి లేఖ రాశారు. క్రిమినల్​ చట్టాలపై పార్లమెంటరీ సమీక్ష జరగాలని ఆమె లేఖలో కోరారు. ఈ చట్టాలపై గతంలో పార్లమెంట్​ లో చర్చ సందర్భంగా విపక్షపార్టీల ఎంపీలు తీవ్ర గందరగోళం సృష్టించారు. చట్టాలపై ఏవైనా సవరణలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని కేంద్రం ప్రకటించినా వినకపోవడంతో 146 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్​ చేశారు.  పునాది బలంగా ఉండాలంటే ఈ చట్టాలపై సమీక్ష, చర్చ అవసరమన్నారు. కాగా జూలై 1 నుంచి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తాయని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​ రామ్​ మేఘ్వాల్​ తెలిపిన విషయం తెలిసిందే.