తనపై దాడి అడ్డుకోలే అరిచినా స్పందించలే

చెంపదెబ్బలు, కాలితో తన్నాడు మహిళల స్వాభిమానంపై గొంతెత్తుతా, పోరాడతానన్న స్వాతి మాలివాల్​

May 23, 2024 - 16:28
 0
తనపై దాడి అడ్డుకోలే అరిచినా స్పందించలే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తనపై దాడి జరుగుతుంటే సహాయం కోసం అరిచినా ఎవ్వరూ రాలేదని, స్పందించలేదని రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్​ ఆరోపించారు. గురువారం తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడారు. మే 13న ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినట్లు చెప్పారు. అక్కడ సిబ్బంది మమ్మల్ని డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి, కేజ్రీవాల్ ఇంట్లో ఉన్నారని, కలవడానికి వస్తున్నారని చెప్పారు. అదే సమయంలో బిభవ్ కుమార్ అక్కడికి వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించాడని తెలిపారు. బిభవ్ నన్ను ఏడెనిమిది సార్లు చెంపదెబ్బ కొట్టాడు. నేను అతనిని నెట్టడానికి ప్రయత్నించినప్పుడు కాలు పట్టుకొని లాగాడన్నారు. దీంతో తన తల టేబుల్​ కు తగిలి గాయమైందన్నారు. నన్ను తన్నడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బిగ్గరగా అరిచా ఎవ్వరు సహాయం చేసేందుకు రాకపోవడం విచాకరమని స్వాతి మాలివాల్​ పేర్కొన్నారు. విభవ్​ ఎవరి సలహాల మేరకు తనపై దాడి చేశాడో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. తాను పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ పట్ల తనకున్న అభిప్రాయం తప్పని దీంతో రుజువైందన్నారు. పార్టీ నాయకురాలినైన తనపైనే దాడి జరిగిందంటే సాటి మహిళల పరిస్థితి ఏమిటన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని తనపై జరిగిన అన్యాయాన్ని నిలదీయాలని గొంతెత్తానని స్వాతిమాలివాల్​ స్పష్టం చేశారు.