ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్
స్వాతంత్ర్య వేడుకల్లో అలజడే లక్ష్యం రూ. 3 లక్షల రివార్డు ప్రకటన గతంలోనే అరెస్ట్, పరారీ పక్కా సమాచారంతో అదుపులోకి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య వేడుకల్లో అలజడి సృష్టించాలనుకున్న ఐఎస్ఐఎస్ మాడ్యూల్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఉగ్రవాది ఢిల్లీలోని దర్వాగంజ్ నివాసి అన్నారు. ఐఎస్ఐఎస్ తరఫున పూణె మాడ్యూల్ కు నాయకుడుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2023లోనే ఇతన్ని అరెస్టు చేసినా కస్టడీ నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. ఇతనిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ఉందన్నారు. ఇతని నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్ ఐఎ హిట్ లిస్ట్ లో రిజ్వాన్ ఉన్నాడని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి ఎన్ ఐఎకి ఇతనిని గురించిన పక్కా సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ లో అరెస్టు చేశామని, ఇతని వద్ద నుంచి 3 కాట్రిడ్జ్ లతో కూడిన ఒక 30 బోర్ స్టార్ పిస్టల్, రెండు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.