భారత్ ఎన్నికలపై అమెరికా ఆసక్తి
మోదీ మేనియపై ప్రత్యేక నజర్ మాజీ భారత అమెరికా విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్
నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: భారత్ లో అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలపై అమెరికాకు కూడా ఆసక్తిగా గమనిస్తోందని అమెరికాలో భాతర మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రపంచదేశాల్లో పదేళ్లలో భారత్ పట్ల కీర్తి, ప్రతిష్ఠలు పెరిగాయన్నారు. ప్రస్తుతం భారత్ వైపు అనేక దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని తెలిపారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో మోదీ మేనియా ప్రపంచవ్యాప్తంగా ఉండడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగిందన్నారు.
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ప్రధాని పార్టీ బీజేపీ సాధించే స్థానాలపైనే ఉందని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో విదేశాంగ విధానాలు భేషుగ్గా ఉండడమే ఇందుకు కారణమై ఉండొచ్చన్నారు. విదేశాల్లో ఉన్న ప్రతీ ఒక్క భారతీయుడు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని హర్షవర్ధన్ తెలిపారు.
భారత్ అభివృద్ధి కేవలం దశాబ్ద కాలంలోనే సాధ్యపడడం విశేషమన్నారు. భారత్–అమెరికా మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయని తెలిపారు. అమెరికాలో ఉన్న ముగ్గురు దిగ్గజ నేతలతో (ఒబామా, ట్రంప్, జో బైడెన్)లతో ప్రధాని మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.