హనుమాన్​ జెండా తాకి చూడాలి కాంగ్రెస్​ కు ఓటమి ఇంజెక్షన్

​ అమేథీ సభలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ

May 18, 2024 - 16:50
 0
హనుమాన్​ జెండా తాకి చూడాలి కాంగ్రెస్​ కు ఓటమి ఇంజెక్షన్

అమేథీ: భగవంతుడిని విమర్శించే కుహానా రాజకీయ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే గౌరీగంజ్​ కు వచ్చి హనుమాన్​ జెండాను తాకి చూడాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్​ విసిరారు. కాంగ్రెస్​ పార్టీకి దేశ ప్రజలు ఓటమి అనే ఇంజెక్షన్​ ఇవ్వబోతున్నారని చెప్పారు. శనివారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో స్మృతి ఇరానీ మాట్లాడారు. కాంగ్రెస్​, కూటమి పార్టీలను తూర్పారబట్టారు. బురదలో కూడా నడిచివెళ్లామని ప్రియాంక గాంధీ చెబుతున్నారని, మరీ రోడ్లు ఎందుకు వేయలేకపోయారని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. వెళుతు వెళుతూ బురద కూడా చల్లుకుంటున్నారని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అమేథీలో ఇప్పటికే 262 గ్రామాల్లో పక్కా సీసీ రోడ్లను నిర్మించామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం నిరంతర కార్యక్రమమని పేర్కొన్నారు. బీజేపీ మతాన్ని ఉపయోగించి రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్​, కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. రామ ప్రతిష్ఠకే హాజరు కాని నాయకులంతా భక్తి, విశ్వాసం, నమ్మకాలపై మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమని స్మృతి ఇరానీ మండిపడ్డారు.