పాక్​ గిన్నె పట్టుకుంది ..యువరాజును ప్రధానిని చేయాలని కుట్రా?

ఉగ్రవాదం టైరు పంక్చర్​ చేశాం సువిశాల భారత్​ ను హస్తం కాపాడుతుందా?

May 2, 2024 - 14:02
 0
పాక్​ గిన్నె పట్టుకుంది ..యువరాజును ప్రధానిని చేయాలని కుట్రా?
  • ఉగ్రవాదం టైరు పంక్చర్​ చేశాం సువిశాల భారత్​ ను హస్తం కాపాడుతుందా?
  • కశ్మీర్​ అల్లకల్లోలానికి కారణం ఎవరు?
  • ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం
  • ఆర్టికల్​ 370 తొలగింపు సర్ధార్​ కు నివాళులు
  • పూర్తి రొట్టె తిని మోదీ ప్రభుత్వాన్ని తీసుకువస్తాం
  • ఏ ఒక్క నిరుపేదను అర్థకాలితో పడుకోనీయను
  • రిజర్వేషన్ల పేరుతో నీతిమాలిన చర్యలా?
  • రాజ్యాంగంలోని రిజర్వేషన్లు యథాతథం
  • ముస్లిం రిజర్వేషన్లను కల్పించబోం
  • గుజరాత్​ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

గాంధీనగర్​: పాక్​ గిన్నె పట్టుకుంది. భారత్​ లో హస్తం గెలవాలని ఏడుస్తోంది. యువరాజును ప్రధానిని చేయాలని కుట్రలు పన్నుతోంది. ఉగ్రవాదం టైరు పంక్చర్​ చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రధాని గుజరాత్​ లో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆందన్​ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ కాంగ్రెస్​ పై విరుచుకుపడ్డారు.

భారత్​ లో కాంగ్రెస్​ పూర్తి బలహీనంగా మారోపోయిందన్నారు.  ఇక్కడ హస్తం చనిపోతుంటే పాక్​ కు ఏడుపొస్తోందన్నారు. పాక్​ తహతహలను ఎన్నటికీ నెరవేర్చనీయబోమన్నారు. పాకిస్థాన్​ తో కాంగ్రెస్​ భాగస్వామ్యం పూర్తిగా బట్టబయలు చేశామన్నారు. ఒకప్పుడు బీరాలు పలికే, బీభత్సాలను సృష్టించే పాక్​ ప్రస్తుతం పిండి కూడా కొనలేని దీన స్థితిలో ఉందన్నారు. ఇలాంటి దేశానికి మద్ధతు ప్రకటిస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం 140 కోట్ల ప్రజలున్న సువిశాల భారత్​ ను ఏం కాపాడుతుందని ప్రశ్నించారు. అలా కాపాడే ప్రభుత్వమే అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చేసిందని నిలదీశారు. కశ్మీర్ ను అల్లకల్లోలంగా మార్చివేశారని, దేశ సరిహద్దులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దేశంలో ఎక్కడ చూసినా బాంబ్లస్ట్​ వార్తలే ఉండేవని అన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాద టైర్లు పూర్తిగా పంక్చర్​ చేశామని తెలిపారు. దేశ ద్రోహులను వారి ఇళ్లలోకి వెళ్లి మరీ కొడతామని మరోసారి మోదీ హెచ్చరించారు. 

కశ్మీర్​ లో ఆర్టికల్​ 370 తొలగించడం ద్వారా సర్ధార్​ కు నివాళులర్పించామన్నారు. 75 ఏళ్లుగా రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్​ ను ప్రశ్నించారు. మోదీ రాకముందు దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ఏజెండాలు, ఇద్దరు ప్రధానులుగా విభజించి కూర్చున్నారని మండిపడ్డారు. వాటన్నింటినీ తాము సరిదిద్ది దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని రీతిలో శాంతి, అభివృద్ధి మయమైన పాలనకు ప్రాముఖ్యతనిస్తున్నామన్నారు. 

ఒకప్పుడు సగం రొట్టెలు తినైనా ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్న వారంతా నేడు వారి నిజస్వరూపం తెలిశాక మోదీ ప్రభుత్వం పూర్తి రొట్టె తిని మోదీ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటామని అంటున్నారని అన్నారు. వారంతా కాంగ్రెస్​ పార్టీని వీడారని పేర్కొన్నారు. మోదీ భారత్​ లోని ఏ ఒక్క నిరుపేదను అర్థకాలితో పడుకోనీయడని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశంలోని ప్రతీ ఒక్క నిరుపేద తన కుటుంబ సభ్యులే అని పునరుద్ఘాటించారు.
రిజర్వేషన్ల పేరుతో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడమే గాకుండా నీతిమాలిన చర్యలకు దిగుతారా? అని దుయ్యబట్టారు. ఫేక్​ వీడియోలతో ప్రజలను మభ్య పెడతారా? అని మండిపడ్డారు. కర్ణాటకలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీగా ప్రకటించి ఐదు శాతం రిజర్వేషన్లను ఎవరు కల్పించారని సూటిగా అడుగుతున్నానని దమ్ముంటే చెప్పాలని మోదీ సవాల్​ విసిరారు. గతంలో రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను ఏ మాత్రం కదిలించకుండా మత ప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.