భారత్​– మారిషస్ ది చెరిగిపోని స్నేహాబంధం

మారిషస్ విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ముర్మూకు లా డిగ్రీ ప్రదానం

Mar 12, 2024 - 18:11
 0
భారత్​– మారిషస్ ది చెరిగిపోని స్నేహాబంధం

నా తెలంగాణ, ఢిల్లీ: భారత్–మారిషస్​ ఇరుగు, పొరుగు దేశాలు మాత్రమే కాదని ప్రత్యేక స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనాలని, ఎన్నటికీ ఈ దేశంతో భారత్​ సత్సంబంధం కొనసాగుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్మూకి  మారిషస్ ​విశ్వవిద్యాలయం డాక్టర్​ ఆఫ్​ సివిల్​ లా డిగ్రీని మంగళవారం ప్రదానం చేసింది.

అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ..విశ్వవిద్యాలయాలు యువత ఆకాంక్షలకు, భవిష్యత్ ​రూపకల్పనకు కీలకమన్నారు. డాక్టరేట్​ అందడం తనకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు ఇందుకు మారిషస్ ​ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయాల ద్వారా యువత వారి ప్రత్యేకాభిరుచిని, కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సాహాలు లభిస్తాయన్నారు. విద్య వల్ల ఏ దేశమైనా భవిష్యత్ ​ను నిర్దేశించుకునే స్థాయికి ఎదుగుతుందన్నారు. భారతదేశం ముందుచూపుతో వ్యవహరిస్తూ నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపకల్పన చేసిందన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులను ఆవిష్కరణల వైపు మళ్లించగలుగుతున్నామని తెలిపారు. దీంతో విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. ఐటీఈసీ కార్యక్రమం కింద ప్రతీయేటా 400మంది మారిషస్​ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, 60 మంది వరకు ఉన్నత విద్యను అభ్యసిస్తూ స్కాలర్ షిప్ కూడా పొందడం సంతోషకరమని రాష్ట్రపతి ముర్మూ హర్షం వ్యక్తం చేశారు.