రైతుల గోస పట్టదా? జైళ్లకు వెళ్లొచ్చిన వారు చీపుర్లు పట్టుకొని తిరుగుతున్నారు
రైతుల కోసం క్లస్టర్ల ఏర్పాటు త్వరలో అంబాలా ఢిల్లీ కనెక్టివిటీ సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు మోదీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు సైనికుల క్షేమం కాంక్షిస్తూ ప్రత్యేక బడ్జెట్ అంబాలా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
హరియాణా: రైతుల గోడు ఏ మాత్రం పట్టించుకోనిదే కాంగ్రెస్, కూటమి పార్టీలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని శనివారం హరియాణాలోని అంబాలలో ప్రచార సభలో ప్రసంగించారు. ఓ కూటమి పార్టీ ఢిల్లీలో అవినీతి అక్రమాలకు పాల్పడి జైళ్లకు కూడా వెళ్లొచ్చిన నాయకులు హరియాణాలో చీపుర్లు పట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పంజాబ్ లో చీపురు పట్టివాడు దొంగ అని ఆరోపించారు.
రనత్ లాల్ కటారియా వర్ంతి సందర్భంగా ఆయనకు మోదీ నివాళులర్పించారు. మోదీ ప్రసంగం ఆద్యంతం హరియాణా వాసులను ఆకట్టుకునేలా కనిపించింది. ముందుగా ఆయన తల్లి అంబికా దేవి, మానసాదేవి, అంబాలా భూమాత, ప్రజలకు రామ్ రామ్ (దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండాలని–నమస్తే) అన్నారు. ఈ వాగ్ధాటితో ఒక్కసారిగా సభలో చప్పట్ల వర్షం కురిసింది.
మోదీ చాలా ఏళ్లు హరియాణా రొట్టెలు తిని పెరిగాడని తెలిపారు. బీజేపీ అభ్యర్థి మోహన్ లాల్ బరౌలీకి ఓట్లు వేసి గెలిపించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
అంబాలా నుంచి ఢిల్లీ కనెక్టివిటి కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. త్వరలో అంబాలా నుంచి ఇతర దేశాలకు కూడా విమానాలను నడపనున్నామని స్పష్టం చేశారు.
హరియాణా పెద్ద పారిశ్రామిక హబ్ గా మారుతోందని, కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, కూటమి నాయకుల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. దేశ విచ్ఛిన్నం, హిందూ ఆలయాలపై వ్యతిరేకత, దేశ ద్రోహులకు మద్ధతు, దేశ విభజనకు ప్రయత్నాలు, రిజర్వేషన్లు, మాజీ సైనికులకు ద్రోహం లాంటి అంశాలతో వీరు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వీరితో అప్రమత్తంగా ఉండకపోతే భారత్ మనుగడ కష్టమన్నారు.
రాబోయే కాలంలో హరియాణాలో రైతుల కోసం క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దీని ద్వారా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు పండించే రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు.
హరియాణా వాసుల కల నెరవేర్చే గ్యారంటీని మోదీ ఇస్తున్నాడని ప్రధాని స్పష్టం చేశారు.
హరియాణా నుంచి వెళ్లి దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల తల్లులకు వందనమన్నారు. తమ మనస్సును చంపుకొని తమ పిల్లలను దేశం కోసం అర్పితం చేశారని వివరించారు. మరోవైపు ఇలాంటి వీరభూమిలో శత్రువుల పేరుతో భారత్ ను భయపెట్టేందుకు, సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్నది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే ఆ దేశం గిన్నె పట్టుకొని అడుక్కునే దుస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలన మొత్తం కుంభకోణాలతో కూడుకొని ఉందని మోదీ ఆరోపించారు. మన సైనికులకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు కూడా అందించలేక చేతులెత్తేసిందని పేర్కొన్నారు. కానీ మోదీ వచ్చాక సైనికులకు ప్రత్యేక బడ్జెట్ కల్పించారన్నారు. వారి క్షేమాన్ని కాంక్షించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ప్రధాని తెలిపారు.
జూన్ 4కి ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని దేశ హితం కోసం పాటుపడే బీజేపీకే ఓటు వేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.