హమాస్ అంతమే లక్ష్యం
నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెలీ బందీలను విడిచిపెట్టే వరకు, హమాస్ ఆఖరి ఉగ్రవాదిని అంతం చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని మరోమారు ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నెతన్యాహు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదన్నారు. హమాస్ వల్ల ఇప్పటికే ఇజ్రాయెల్ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. మరోమారు నష్టపోయేందుకు సిద్ధంగా లేమని తాడో–పేడో తేల్చే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. రఫాలో ఉన్న హమాస్ స్థావరాలు వ్యక్తులనందరినీ హతమారుస్తామని సంచలన ప్రకటన చేశారు.
తమపై దాడి 1500మంది పొట్టన బెట్టుకున్నప్పుడు ఈ అంతర్జాతీయ సమాజం ఎక్కడకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 250 మంది బందీలు వారి చేతిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద భావజాలం ఉండి ఇజ్రాయెల్ కు నష్టం కలిగించాలనే ఏ ఒక్కరిని వదలబోమని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ చేతిలో మరణించిన తమదేశ ప్రజలకు నివాళులర్పించారు. హమాస్ ను అంతం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.