ఎంపీపై దాడి జరిగితే జవాబు చెప్పరా?
మహిళలపై దాడులను బీజేపీ సహించదు మమత నిందితులకు కొమ్ము కాస్తున్నారు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాలివాల్ పై దాడి ఆప్ ఆరోపణలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మహిళపై దాడి జరిగితే దానికి జవాబిచ్చే బాధ్యత మీ వద్ద లేదా? అంత సమయం కూడా సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. శనివారం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. మీపార్టీలో జరిగిన గొడవలకు బీజేపీకి ఏం సంబంధమని నిలదీశారు. ఒక మహిళ, రాజ్యసభ సభ్యురాలు, ఎంపీపై దాడి జరిగితే ఎవ్వరూ స్పందించవద్దని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మహిళలపై దాడులను బీజేపీ ఎన్నటికీ సహించబోదన్నది గుర్తెరగాలని జేపీ నడ్డా ఆప్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై ఆరోపణలు చేసేముందు మీరు ప్రజల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారో వివరించాలని పేర్కొన్నారు. ఆప్ పార్టీ సీఎమే మద్యం కుంభకోణంలో నిందితుడని ప్రస్తుతం బెయిల్ పై ఉండి ఇతరులపై విమర్శలు, ఆరోపణలు చేయడం ఆయన దుష్ఠ రాజకీయాలకు నిదర్శనమని నడ్డా మండిపడ్డారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడుతూ 'లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మేము (కేంద్ర ప్రభుత్వం) వారికి సహాయం చేస్తామన్నారు. కానీ సీఎం మమతా బెనర్జీ ఉద్దేశాలు, నిర్ణయాలు స్పష్టంగా లేవన్నారు. ఆమెపై బీజేపీకి అనుమానం ఉందన్నారు. సందేశ్ ఖాళీ మహిళలపై దాడి ఘటనలో షాజహాన్ షేక్ విషయంలో ఆమె మౌనం వహించడం వెనుక కారణం ఏంటని ప్ర్నించారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ మొదట ఎందుకు మౌనంగా ఉండి, తర్వాత బీజేపీపై ఆరోపణలు చేయడం ప్రారంభించారని ప్రశ్నించారు? ఓటు బ్యాంకు కోసం దేశ భద్రతతో ఆడుకుంటున్నారు. టీఎంసీ చొరబాటుదారులకు ఆశ్రయం ఇస్తూ వారికి ఐడీ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి ఓటర్లను చేస్తోందని మండిపడ్డారు. దేశ వ్యతిరేక చర్యలకు మమత తెర తీశారని చెప్పారు. సీఏఏ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మమత వ్యవహరిస్తున్నారని జేపీ నడ్డా పేర్కొన్నారు.