సోమవారం నుంచే పార్లమెంట్​ సమావేశాలు

Parliament meetings from Monday

Jun 23, 2024 - 13:43
 0
సోమవారం నుంచే పార్లమెంట్​ సమావేశాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 18వ పార్లమెంట్​ సమావేశాలో బీజేపీ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డాక తొలిసారి సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భర్త​ృహరి మెహతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా రాష్ర్టపతి ప్రమాణం చేయించనున్నారు. జూన్‌ 26వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. రెండు రోజులపాటు లోక్​ సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మెహతాజ్​ నిర్వహించనున్నారు. 280మంది ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. రెండో రోజు మంగళవారం తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

స్పీకర్​ ఎన్నికపై బీజేపీ అందరి ఏకాభిప్రాయంతో చేపట్టాలని చూస్తోంది. ఈ సారి కూడా ఓం బిర్లాకే స్పీకర్​ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుండగా, విపక్షాలకు డిప్యూటీ పదవి ఇచ్చే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.