టెల్ అవీవ్ పై హమాస్ దాడులు
నగరంలో సైరన్ల మోత దాడులను అడ్డుకున్నామన్న ఐడీఎఫ్ ప్రధాని నెతన్యాహు అత్యవసర సమావేశం
జెరూసలేం: హమాస్ ఇజ్రాయెల్ పై ఆదివారం భారీ దాడులకు దిగింది. రాకెట్ లాంచర్లు, క్షిపణులతో ఒక్కసారిగా దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతోంది. హమాజ్ దాడితో ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ నగరంలో సైరన్ లను మోగించారు. మరోవైపు రాకెట్ లాంచర్లు, క్షిపణులను గాలిలోనే పేల్చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. కాగా ఈ దాడులతో టెల్ అవీవ్ నగరంలో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. గాజాలో పౌరుల ఊచకోతపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులు చేశామని హమాస్ మీడియాకు తెలిపింది. మరోవైపు హిజ్బుల్లా సంస్థ కూడా ఇజ్రాయెల్ పై భారీ దాడి చేస్తామని హెచ్చరించింది. దాడులు, హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. దాడులను ఎదుర్కుంటూనే భూతల, ఆకాశ మార్గాన దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.