టాప్​ కమాండర్​ పాపారావు మృతి!?

నక్సల్స్​ ఆపరేషన్​ లో భద్రతా బలగాల భారీ విజయం ఎన్​ కౌంటర్​ లో 12 మంది మృతి టాప్​ కమాండర్ల సమావేశం సమాచారం కూంబింగ్​ లో ఎదురు కాల్పులు నక్సల్స్​ కు భారీ నష్టం కొనసాగుతున్న కూంబింగ్​, కాల్పులు సంఘటనా స్థలానికి భారీ ఎత్తున బలగాలు

May 10, 2024 - 18:16
May 10, 2024 - 19:16
 0
టాప్​ కమాండర్​ పాపారావు మృతి!?

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లో ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్​ కౌంటర్​ లో 12 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. నక్సల్​ టాప్​ కమాండర్​​ పాపారావు కూడా మృతిచెందినట్లుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికార వర్గాలు,పోలీసులు ధృవీకరించలేదు. 

గురువారం అర్థరాత్రి నుంచి బీజాపూర్​ గంగటూరు పీడియా అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అడవిలో ఒకచోట సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంత కూంబింగ్​ నిర్వహించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉండడంతో ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు వివరించాయి.

ఈ సమావేశంలో నక్సలైట్ల కమాండర్లు ఉన్నట్లు సమాచారం. ఎవరెవరు ఉన్నారనేది మాత్రం తెలియరాలేదు. అందరూ నిష్ణాతులైన నక్సలైట్లే ఉన్నారని మాత్రం పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వివరించారు. ఈ ఎన్​ కౌంటర్​ పై హుటాహుటీన చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్​, పోలీసులు, ఎస్పీఎఫ్​ తదితర భద్రతా బలగాలను ఎస్పీ, డీఐజీలు రప్పించారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి నెలకొంది.

పాపారావుతోపాటు లింగ అనే నక్సలైట్ కమాండర్​ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు నక్సలైట్లకు సంబంధించి పెద్ద నాయకులని కూడా చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్టీఎఫ్​, డీఆర్జీ, సీఆర్పీఎఫ్​ కు చెందిన దంతేవాడ, సూక్ష్మా, కోబ్రా, బీజాపూర్​ ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరింత సమయం గడిస్తే గానీ విషయం ఏంటనేది చెప్పలేని స్థితి నెలకొంది. 

ఇటీవలే ఏప్రిల్​ 30న జరిగిన ఎన్​ కౌంటర్​ లో 10 మంది నక్సల్స్​ ను బస్తర్​ పోలీసులు హతమార్చారు. వీరిలో ఏడుగురు పురుషులుండగా, ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్న విషయం తెలిసిందే.