రెమాన్ హెచ్చరికలు జారీ
ఈశాన్య తీర ప్రాంతాలను దాటనున్న తుపాను పశ్చిమ బెంగాల్ లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
కోల్ కతా: రెమాన్ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఇది పశ్చిమ బెంగాల్ లోని ఆదివారం అర్థరాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలను ఆరీ చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్ లోని సాగర్ ద్వీపం–ఖేపుపారా వద్ద తీరాన్ని దాటుతుందని ఐఎండీ అధికారి సోమనాథ్ దత్తా వెల్లడించారు. మరోవైపు తుపాను ప్రభావం ఒడిశా, ఈశాన్య భారత్ లోని సముద్ర తీర ప్రాంతాలున్న రాష్ర్టాలపై కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 12 బృందాలను సిద్ధంగా ఉంచింది. తుపాను తీరం దాటాక తీవ్ర వర్షం, గాలులు కొనసాగే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.
మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్,త్రిపురలలో కూడా రెమాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.