ఎమర్జెన్సీ విధింపు.. రాజ్యాంగానికి వ్యతిరేకం
Imposition of emergency.. is against the constitution
- ప్రజల మనోభావాలు గౌరవించని హస్తం
- పత్రికా స్వేచ్ఛను పట్టించుకోలేదు
- వ్యతిరేకించిన మహనీయులకు నివాళులు
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవడం కోసమే ఎమర్జెన్సీని విధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందన్నారు. దేశానికి, సమాజానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసి ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని ప్రధాని మండిపడ్డారు. ఎమర్జెన్సీని విధించి మంగళవారానికి 49యేళ్లు గడుస్తున్న సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని విధించిన పార్టీకి రాజ్యాంగాని గురించి చెప్పుకునే హక్కు లేదన్నారు. పత్రికా స్వేచ్ఛను సైతం రద్దు చేస్తూ ఎమర్జెనీని అమలు చేశారని పేర్కొన్నారు. ఫెడరలిజాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. చరిత్రలో జూన్ 25 ఒక ముఖ్యమైన సంఘటనకు సాక్షిగా ప్రధాని పేర్కొన్నారు.
ఎమర్జెనీని వ్యతిరేకించిన మహానీయులు, మహిళలకు నివాళులర్పించాలన్నారు. ప్రతీ భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ప్రధాని మోదీ మండిపడ్డారు.