అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్​

నాసా స్టార్​ లైనర్​ ప్రయోగానికి సిద్ధం 

Jun 1, 2024 - 15:33
 0
అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్​

ఫ్లోరిడా: ప్రముఖ అంతరిక్ష శాస్ర్తవేత్త సునీతా విలియమ్స్​ మరోమారు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. నాసా రూపొందించిన ‘స్టార్​ లైనర్​’ ద్వారా శనివారం రాత్రి యాత్రకు బయలుదేరనున్నారు. ఈ శాటిలైట్​ కెనడాలోని ఫ్లోరిడా స్పేస్​ సెంటర్​ నుంచి శనివారం రాత్రి 10 గంటలకు వెళ్లనుంది. మే 7న ఈ యాత్రకు సిద్ధమైనా పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్​ ఒక వారంపాటు గడపనున్నారు. ఐఎస్​ఐఎస్​ లో వివిధ రకాలైన పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మిషన్​ విజయవంతం అయితే సామాన్యులకు కూడా అంతరిక్ష కేంద్ర యాత్రలకు నాసా సిద్ధం కానుంది. 

2006లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్​ 2007 జూన్​ 22 వరకు ఉన్నారు. సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 29 గంటల 17 నిమిషాలపాటు స్పేస్​ వాక్​ చేసి రికార్డు సృష్టించారు. అనంతరం 2012లో రెండోసారి నాలుగు నెలలపాటు కూడా అంతరిక్ష యాత్ర చేపట్టారు. సునీతా విలియమ్స్​ భారతీయ మూలాల వ్యక్తి కావడం గమనార్హం.