గుజరాత్​ వరదలు సహాయక చర్యల్లో వేగం పెంచాలి

సహాయ సహకారాలు అందిస్తాం: ప్రధాని మోదీ

Aug 29, 2024 - 15:59
 0
గుజరాత్​ వరదలు సహాయక చర్యల్లో వేగం పెంచాలి

గాంధీనగర్​: గుజరాత్‌లో వరదల్లో సహాయక చర్యల్లో వేగం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఆ రాష్​ర్ట ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ తో ఫోన్​ లో మాట్లాడి వర్షాలు, వరద వివరాలడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. సౌరాష్​ఱ్ట, కచ్​, దక్షిణ ప్రాంతాలలో వర్షాల తీవ్రత తగ్గినా వరద తీవ్రత కొనసాగుతోందని సీఎం భూపేంద్ర ప్రధానికి వివరించారు. పలు లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలకు సిబ్బందిని రంగంలోకి దింపిందని వివరించారు. నష్టతీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందన్నారు. వర్షాలు, వరదలు తగ్గాక నష్టతీవ్రతపై వివరాలను వెల్లడిస్తామన్నారు. కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని మోదీకి సీఎం భూపేంద్ర పటేల్​ విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వైద్య బృందాలను పంపనున్నట్లు ప్రధాని తెలిపారు. వరద నష్టంపై రాష్​ర్టం నుంచి పూర్తి నివేదిక అందగానే ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని మోదీ హామీ ఇచ్చారు.