అత్యధిక సంఖ్యలో ఓటింగ్​ లో పాల్గొనాలి

కాశీ ఓటర్లకు ప్రధాని మోదీ వీడియో సందేశం

May 30, 2024 - 17:09
 0
అత్యధిక సంఖ్యలో ఓటింగ్​ లో పాల్గొనాలి

వారణాసి: కాశీ ఓటర్లు జూన్​ 1న జరిగే పోలింగ్​ లో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గురువారం వీడియో సందేశంలో కోరారు. చారిత్రక నగరం కాశీలోని ప్రతీ పోలింగ్​ బూత్​ లో వందకు వందశాతం పోలింగ్​ నమోదయ్యేలా కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కాశీలోని రెండువేలమంది మేధావులు, ప్రభావిత వ్యక్తులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. భక్తి, శక్తి, త్యాగాల నగరం కాశీ అన్నారు. ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ప్రధాని పేర్కొన్నారు. బాబా విశ్వనాథుని కృప తనపై ఉందన్నారు. ఇక్కడి ప్రజాశీర్వాదం కూడా తనకు ముఖ్యమన్నారు. మొత్తం 93,500 మంది ఓటర్లకు లేఖలు, సర్టిఫికెట్లను ప్రధాని పంపారు. వారణాసిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో వీటిని వెయ్యిమంది పంపిణీ చేస్తున్నారు.