ఇంధన ట్యాంకర్​ పేలి 94 మంది మృతి

50 మందికి తీవ్ర గాయాలు

Oct 16, 2024 - 15:42
 0
ఇంధన ట్యాంకర్​ పేలి 94 మంది మృతి

నైజీరియా: నైజీరియాలో ఇంధన ట్యాంకర్​ పేలి 94 మంది మృతి చెందారు. 50మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉత్తర నైజీరియాలోని జిగావా రాష్ర్టంలో ఇంధన ట్యాంకులో పేలుడు సంభవించినట్లు పోలీసు ఉన్నతాధికారిక లావాన్​ ఆడమ్​ తెలిపారు. ఇంధన ట్యాంకర్​ బోల్తాపడిందన్నారు. బోల్తాపడిన ట్యాంకర్​ నుంచి స్థానికులు ఇంధనాన్ని తరలించేందుకు ప్రయత్నించగా పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 94 మంది మృతి చెందారని, మరో 50మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.