మోదీకి గార్డ్​ ఆఫ్​ హానర్​

గయానాలో ఘన స్వాగతం

Nov 20, 2024 - 11:48
 0
మోదీకి గార్డ్​ ఆఫ్​ హానర్​

జార్జిటౌన్​: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గయానాలో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం గయానాకు చేరుకున్న ప్రధాని మోదీని అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ, క్యాబినెట్ మంత్రులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు అలీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ భారతీయులతో ఎయిర్​ పోర్ట్​ లోనే కాసేపు ముచ్చటించారు. 

మోదీకి ‘గార్డ్ ఆఫ్ హానర్’


అనంతరం గయానాలోని జార్జ్‌టౌన్‌లో ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు.  అధ్యక్షుడు అలీ మోదీని గార్డ్​ ఆఫ్​ హాన్​ తో సత్కరించారు.