మహాలో ప్రముఖుల ఓట్లు

Mahalo celebrity votes

Nov 20, 2024 - 11:29
 0
మహాలో ప్రముఖుల ఓట్లు
ముంబాయి: మహారాష్ర్టలో ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ లో తల్లి సరితా ఫడ్నవీస్, భార్య అమృత ఫడ్నవీస్ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్​ పూర్​ లో కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ ఓటు వేశారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినిమా నటుడు అక్షయ్​ కుమార్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రికెటర్​ సచిన్​ టెండూల్కర్​ ముంబాయిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్​ కమిషన్​ తనను బ్రాండ్​ అంబాసిడర్​ గా నియమించుకోవడం గర్వకారణమన్నారు. బారామతి నుంచి సుప్రియా సూలే, ఆయన తండ్రి శరద్​ పవార్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబాయి బీజేపీ అధ్యక్షుడు ఆశిష్​ తన ఓటు వేశారు. నాగ్​ పూర్​ లో ఆర్​ ఎస్​ ఎస్​ నాయకుడు జోషి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజిత్​ పవార్​ ఎన్సీపీ బారామతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహాయుతి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిట్​ కాయిన్​ ఆరోపణల్లో సుప్రియా సూలేదే ఫోన్​ సంభాషణ అని అన్నారు. మహారాష్ర్ట గవర్నర్​ సిపి రాధాకృష్ణన్​ ముంబాయిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్​ అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రతీఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాగ్​ పూర్​ లో ఆర్​ ఎస్​ ఎస్​ ప్రముఖ్​ ఆర్​.ఎస్​. భగవత్​ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయడం వారి కనీస బాధ్యత అన్నారు. 
 
ప్రధాని మోదీ విజ్ఞప్తి..
మహారాష్​ర్ట ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్​ లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఓటింగ్​ లో ఉత్సాహంగా పాల్గొనాలని, యువకులు, వృద్ధులు, మహిళలు, నూతన ఓటర్లు అనే తేడా లేకుండా ప్రతీఒక్కరూ ఉదయాన్నే ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరారు.