పాక్​ సరిహద్దుకు చైనా ఆర్మీ పహారా!

కరోనాతో పరువు పాయే.. భారత్​ నే నమ్ముతున్న ప్రపంచదేశాలు కార్యకలాపాల విస్తృతంపై భారత్​ ప్రతిచర్యలు?

May 29, 2024 - 17:37
 0
పాక్​ సరిహద్దుకు చైనా ఆర్మీ పహారా!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘ఆడలేక మద్దెల దెరువు’ అన్నట్లు చైనా పాక్​ వెంట కలిసి కుయుక్తులకు దిగుతోంది. ఈ విషయాలు పలుమార్లు బహిర్గతమయ్యాయి. పాక్​ డ్రోన్లు, ఆయుధాలు చైనావే అని తేలింది. అదీ చాలదన్నట్లు పాక్​ సరిహద్దు వెంట చైనా సైనికులు పహారా కాస్తున్నారు. ఇప్పటికే కరోనా కాలం నుంచి చైనా అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రపంచదేశాల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా నట్టేట ముంచుకుంది. దీంతో మోదీ చర్యలతో భారత్​ ను ప్రపంచదేశాలు పూర్తిగా విశ్వసిస్తున్నాయి. ఈ పరిణామాలు చైనా–పాక్​ లకు రుచించడం లేదు. 

చైనా సైనికులు పహారా కాస్తుండడంపై భారత్​ కూడా అప్రమత్తంగానే ఉంది. సరిహద్దు వెంట ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. 
ఎల్​ వోసీ లో ఉక్కు బంకర్ల నిర్మాణం, మానవరహిత విమానాలు, యుద్ధవిమానాల ఏర్పాటులో చైనా కీలకంగా వ్యవహరిస్తోందని బుధవారం భారత్​ అధికారులు తెలిపారు. చైనా–పాక్​ కారిడార్​ పీవోకే ద్వారానే నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ కారిడార్​ ను వ్యతిరేకిస్తూ పలు దాడులు జరిగి చైనా కార్మికులు, అధికారులు అనేక మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 

గతంలో గిల్గిత్​, బాల్టిస్థాన్​ లో చైనా కార్యకలాపాలపై భారత్​ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో చైనా కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తోంది. 

అంతర్జాతీయంగా ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్​ కూడా పలు వ్యూహాత్మక చర్యలకు దిగబోతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ చర్యలేంటన్నది మాత్రం వెల్లడించలేదు.