ఉగ్రవాదం అంతం.. పాక్​ తో చర్చలు సాధ్యం

ఐరాస భారత ప్రతినిధి పర్వతనేని హరీష్​

Nov 20, 2024 - 11:58
 0
ఉగ్రవాదం అంతం.. పాక్​ తో చర్చలు సాధ్యం

ఇస్లామాబాద్​: ఉగ్రవాదం అంతంతోనే పాక్​ తో భారత్​ చర్చలు సాధ్యమని ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనని హరీష్​ స్పష్టం చేశారు. కొలంబియా విశ్వ విద్యాలయంలోని స్కూల్​ ఆఫ్​ ఇంటర్నేషనల అండ్​ పబ్లిక్ అఫైర్స్‌లో ‘ప్రధాన ప్రపంచ సవాళ్లకు ప్రతిస్పందించడం భారతదేశ మార్గం’ అనే థీమ్‌తో బుధవారం నిర్వహించిన కార్యక్రమం అనంతరం పర్వతనేని మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారని, అయితే భారత్‌లో పాకిస్థాన్‌ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలు విశ్వాసాన్ని నాశనం చేశాయని అన్నారు. పాకిస్థాన్‌తో చర్చల్లో మొదటి అంశం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ముఖ్య అంశమన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పూర్తిగా అంతమొందించినప్పుడే పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభమవుతాయని స్పష్​టం చేశారు. ఐరాసలోనూ  ఉగ్రవాదం పెద్ద సమస్య అని భారత్​ ప్రతినిధి హరీశ్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. అంతర్జాతీయ సకారంతో ఉగ్రవాదాన్ని సమూలంగా ఎదుర్కోవచ్చన్నారు. కానీ పాక్​ ఆ దిశలో చర్యలు చేపట్టడం లేదన్నారు. అందుకే భారత్​–పాక్​ చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొందని పునరుద్ఘాటించారు.